2016లో తెలంగాణ‌లో ఏం జ‌రిగింది?

kcr18

నూత‌న సంవ‌త్స‌ర సంబురాల‌తో 2017లోకి అడుగుపెట్టాం. అయితే 2016లో ఏం జ‌రిగింది? స‌్వ‌రాష్ట్రంగా ఆవిర్భ‌వించిన తెలంగాణ ఈ దిశ‌గా ముందుకు సాగిందా? అనే సందేహాలు అనేక‌మందిలో ఈ భావ‌న స‌హ‌జ‌మే. బంగారు తెలంగాణ దిశగా రాష్ట భవిష్యత్తుకు బలమైన పునాది వేసిన సంవత్సరంగా 2016 నిలిచింది. చరిత్రలో మైలురాయిగా మిగిలేలా 21 కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. దశాబ్దాల అనంతరం రాష్ట్రం నలుమూలలా వేల చెరువులు మత్తడి దుంకి జలకళను సంతరించుకున్నాయి. చివరిదశలో ఉన్న అనేక ప్రాజెక్టులు, నీటిపథకాల ప్రారంభోత్సవాలు జరిగాయి. చరిత్రలో తొలిసారి కొత్త ప్రాంతాలకు ప్రాజెక్టులనుంచి నీరు అందింది. తెలంగాణ దశను మార్చే కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుల శంకుస్థాపనలు జరిగాయి. మిషన్ భగీరథ తొలిదశ నీటి విడుదల జరిగింది. పారిశ్రామిక రంగం విశేష ప్రగతి సాధించింది. ప్రపంచ దిగ్గజాలు అనదగ్గ సంస్థలు రాష్ట్రంలో కాలు మోపాయి.

సింగరేణి సంస్థ ఉత్పత్తి -లాభార్జనలో కొత్త రికార్డులు సృష్టించింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూసిన డిపెండెంట్ ఉద్యోగాల కల నెరవేరింది. డబుల్‌బెడ్‌రూం బాలారిష్టాలన్నీ అధిగమించి పట్టాలెక్కి వేగం పెంచుకుంది.భారీ ఎత్తున గురుకులాల ఏర్పాటుతో కేజీ టు పీజీకి బీజం పడింది. గ్రామగ్రామానికి రహదారులు విస్తరిస్తుండగా వందల సంఖ్యలో వంతెనల నిర్మాణాలు, ప్రారంభాలు జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక రంగంలో చూస్తే కృష్ణా పుష్కరాలు వైభవోపేతంగా నిర్వహించారు. తెలంగాణ ఆరాధ్యదైవాలు యాదాద్రీశుని ఆలయ నిర్మాణం ప్రారంభం కాగా, వేములవాడ రాజేశుని ఆలయ అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు విద్యుత్, నీరు వంటి ప్రాథమిక సమస్యలు ఎదురయ్యాయి. ఉద్యోగుల కొరత ఇబ్బంది పెట్టింది. రెండు సంవత్సరాలు ప్రకృతి సహకరించలేదు. ఆ సమస్యలన్నింటికీ 2016 వీడ్కోలు పలికింది. ప్రగతి పనులు వేగం పుంజుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలకు దేశ వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. ఈవోడీబీలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఇవాళ తెలంగాణ ప్రజలు బంగారు తెలంగాణ సాధన మీద నిండైన విశ్వాసంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు.

ఇవి సాధించారు…
-మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించిన చెరువుల సంఖ్య 25 వేలకు చేరింది. నీటిపారుదల శాఖకు రూ. 25 వేల కోట్ల బడ్జెట్ కేటాయింపు మొదలైంది. పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరిగాయి. మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం కుదిరింది.
-రాష్ట్ర చరిత్రలో మైలు రాయిగా నిలిచేలా 21 కొత్త జిల్లాలు, 25 కొత్త రెవెన్యూ డివిజన్లు, 125 మండలాలతో పాలనలో అతిపెద్ద సంస్కరణ విజయవంతంగా అమలు జరిగింది.
-రైతులకు 9 గంటల కరెంటు సరఫరా ప్రారంభమైంది. రైతు రుణమాఫీ 75శాతం పూర్తయింది.
-మిషన్ భగీరథ కింద గజ్వేల్ నియోజకవర్గంలో నీళ్లు అందించడం ప్రారంభమైంది. ఆర్థిక వనరులను అందించేందుకు బ్యాంకులు పోటీపడి ముందుకు వచ్చాయి.
-డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి పూర్తిస్థాయి స్పష్టత వచ్చింది. సీఎం దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నరసన్నపేటల్లో అంగరంగ వైభవంగా గృహప్రవేశాలు జరిగాయి. ఇసుక, సిమెంట్ వ్యవహారాలను ప్రభుత్వం కొలిక్కి తేవటంతో రాష్ట్ర మంతటా పనులు వేగం పుంజుకున్నాయి.
-టీఎస్‌పీఎస్‌సీ ద్వారా ఉద్యోగాల నియామకాలు ప్రారంభమయ్యాయి. గ్రూప్ ఉద్యోగాలు, శాఖల నియామకాలతో కమిషన్ పూర్తిస్థాయిలో బిజీ అయిపోయింది. కొలువులకు పరీక్షలు, నియామకాలు పుంజుకున్నాయి.
-సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లాభాల్లో కార్మికులకు 23శాతం బోనస్ ఇచ్చారు.
-హైదరాబాద్‌లో 1.25 లక్షల మంది నిరుపేదలకు పట్టాలిచ్చారు. విద్యుత్ బిల్లులు మాఫీ చేశారు. మెట్రో రైలు పనుల్లో వేగం పెరిగింది.
-మైనారిటీ విద్యార్థులకు 160 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటయ్యాయి.
-విదేశాల్లో చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఆర్థిక సాయం ప్రారంభమైంది.
-సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు సన్నబియ్యం అందించారు. ఇందుకోసం రూ. 4423 కోట్లు కేటాయించారు. యూనివర్సిటీలు, కళాశాలల హాస్టళ్లకుకూడా విస్తరించనున్నారు.
-కల్యాణ లక్ష్మి పథకం బీసీలకు కూడా వర్తింప చేశారు.
-టీఎస్ ఐపాస్ ఫలితాలు మొదలయ్యాయి. రూ. 44,791 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫార్మాసిటీ, నిమ్జ్, వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్ పనుల్లో వేగం పెరిగింది.
-తెలంగాణకు హరితహారం కింద 40 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతమైంది.
-జాతీయ రహదారుల విషయంలో విశేష ప్రగతి జరిగింది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో రూ. 3 వేల కోట్లకుపైగా వ్యయంతో జాతీయ రహదారులు మంజూరయ్యాయి.
-ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు 44 శాతం, విద్యుత్ శాఖలో 27.5 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు చేశారు. మహిళా ఉద్యోగులకు 90 రోజుల పిల్లల సంరక్షణ సెలవులను ప్రకటించారు.

NO COMMENTS

Leave a Reply