కేసీఆర్ పై ఆంధ్రా ఎమ్మెల్యే ప్ర‌శంస‌లు

pinnelli

ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. కాజీపేటలో నిర్వహించిన బాలవికాస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ లాంటి నాయకత్వం ఏపీలో లేదు అని బాధపడుతున్నానని చెప్పారు. ప్రజల సమస్యలను పట్టించుకుని వారికి కేసీఆర్ వెన్నుదన్నుగా నిలవడం శుభపరిణామం అన్నారు.

పాలనలో ఆంధ్ర‌కు .. తెలంగాణకు పొంతన లేదన్నారు. ఆంధ్ర‌లో అవకాశవాద రాజకీయాలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. పేదలను పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో మంత్రి హరీష్‌రావు లాంటి నేత ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టమని, ఆంధ్రాలో మీడియా మేనేజ్‌మెంట్ తప్ప సమస్యను పట్టించుకోవడం లేదని చెప్పారు.

NO COMMENTS

Leave a Reply